సి.ఆర్.ఐ సోలార్ 6,894 సోలార్ పంపింగ్ సిస్టమ్ కోసం ₹210 కోట్ల విలువైన అతిపెద్ద బహుళ-రాష్ట్రాల ఆర్డర్లను సంపాదించింది
సిఆర్ఐ పంప్స్ యొక్క ఒక విభాగం మరియు పునరుత్పాదక ఇంధన - ఆధారిత నీటి పరిష్కారాలలో అగ్రగామిగా ఉన్న సిఆర్ఐ సోలార్, 6,894 సౌర పంపింగ్ సిస్టమ్ సరఫరా, వ్యవస్థాపన మరియు నెలకొల్పడం కోసం మహారాష్ట్ర ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (MEDA), హర్యానా రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (HAREDA) మరియు పంజాబ్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (PEDA) నుండి గణనీయమైన ఆర్డర్లను సంపాదించింది, వీటి మొత్తం విలువ ₹210 కోట్లుగా ఉంది.
ప్రతిష్టాత్మకమైన ఈ ఆర్డర్లు భారతదేశ వ్యవసాయ ఆధారిత ప్రాంతాలలో సుస్థిరమైన నీటిపారుదల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఒక సంఘటితమైన ప్రయత్నాన్ని సూచిస్తున్నాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పునరుత్పాదక ఇంధన మరియు వ్యవసాయ ఉత్పాదకత లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి చేయూత ఇవ్వడంలో సిఆర్ఐ యొక్క పెరుగుతున్న పాత్రను ఈ నిమగ్నతలు నొక్కి చెబుతున్నాయి.
సిఆర్ఐ సోలార్, కచ్చితత్వం మరియు నాణ్యత భరోసాతో పెద్ద ఎత్తున సౌర నీటి పంపింగ్ ప్రాజెక్టులను అమలు చేయడంలో తన విస్తృత నైపుణ్యాన్ని వెలికితీసి ఉపయోగించుకుంటుండగా సంబంధిత ఏజెన్సీల సమయరేఖలకు అనుగుణంగా ప్రాజెక్టు యొక్క విస్తరణ మొదలవుతుంది.
ఈ గణనీయమైన మైలురాయి గురించి వ్యాఖ్యానిస్తూ, సిఆర్ఐ గ్రూప్ చైర్మన్ శ్రీ జి. సౌందరరాజన్ గారు ఇలా అన్నారు:
“భారతదేశంలోని గ్రామీణ మరియు వ్యవసాయ సంబంధిత సన్నివేశాలలో పరిశుభ్రమైన, నమ్మదగిన మరియు సుస్థిరమైన నీటి ప్రాప్యతను కల్పించడంలో సిఆర్ఐ యొక్క అకుంఠితమైన నిబద్ధతను ఈ ఏకీకృత సాధన ప్రతిబింబిస్తుంది. ఈ ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలకు అతీతంగా ముందుకు వెళతాయి - అవి గ్రామీణ శ్రేయస్సు, ఇంధన సామర్థ్యం మరియు పర్యావరణ బాధ్యతకు దోహదకారులు అవుతాయి. భారతదేశం తన స్వచ్ఛ ఎనర్జీ ఎజెండాను కొనసాగిస్తూ ఉన్నందువల్ల, సిఆర్ఐ సోలార్, వినూత్నఆవిష్కరణ మరియు ప్రభావంతో ముందుండి నడిపించడానికి సిద్ధంగా ఉంది” అన్నారు.
భారతదేశ వ్యాప్తంగా 181,000 కి మించిన సౌర పంపింగ్ వ్యవస్థలు మరియు ఐఓటీ ఆధారిత చక్కని పరిష్కారాలను ప్రారంభించడంతో, సిఆర్ఐ పంప్స్ ఇంధన- సమర్థవంతమైన మరియు సుస్థిరమైన నీటి యాజమాన్య పరిష్కారాల పరివర్తనకు ఆధిపత్యం వహిస్తూనే ఉంది. ఈ చొరవ కార్యక్రమాలు 6,100 మిలియన్ kWh యూనిట్లకు పైగా ఎనర్జీ ఆదాకు దోహదపడ్డాయి మరియు 4.80 మిలియన్ టన్నులకు పైగా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నివారించడంలో సహాయపడుతూ పర్యావరణ సారధ్యానికి సిఆర్ఐ నాయకత్వాన్ని బలోపేతం చేశాయి.
ప్రభుత్వ నేతృత్వంలోని స్వచ్ఛ ఎనర్జీ చొరవలకు కంపెనీని విశ్వసనీయమైన భాగస్వామిగా ఉంచుతున్న సిఆర్ఐ సోలార్ అందజేతలలో అధిక సామర్థ్యం గల సోలార్ పంపింగ్ సిస్టమ్లు, తెలివైన రిమోట్ పర్యవేక్షణ మరియు సమీకృతమైన విక్రయానంతర సేవ ఉన్నాయి.

Comments
Post a Comment